Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:50 AM

సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ముందడుగు… దోమల నివారణ చర్యలు

30-03-2026 163 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి,: గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నీర్నంల గ్రామంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామంలో విపరీతంగా పెరిగిన దోమల సమస్యను పరిష్కరించేందుకు సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ముందడుగు వేశారు.

ప్రజల విజ్ఞప్తి మేరకు 15 రోజుల క్రితం కొత్త దోమల నివారణ యంత్రాన్ని కొనుగోలు చేసి, సోమవారం గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో ప్రతి వార్డులో తిరుగుతూ దోమల మందు పిచికారీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధితో పాటు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామంలో పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ కోసం మరిన్ని చర్యలు చేపడతామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆవుల శ్రీశైలం యాదవ్, వార్డు సభ్యులు చిన్నపాక రమేష్, పెరుమాండ్ల నవీన్, ముత్యాల కిషన్, నాగొండ మల్లికార్జున్, నాగటి ఉపేందర్, బోయిన ఐలమ్మ, నోముల ఉమారాణి, కట్ట తనుశ్రీ, నాగొండ రవళి తదితరులు పాల్గొన్నారు.

గ్రామంలో దోమల నివారణ చర్యలు చేపట్టినందుకు సర్పంచ్ మరియు పాలకవర్గానికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ముందడుగు… దోమల నివారణ చర్యలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News