Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 09:54 AM

సామ్రాజ్యవాదం వల్లే అసమానతలు – కమ్యూనిస్టు విధానాలతోనే ప్రజలకు మౌలిక వసతులు

22-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సీపీఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డి.వి. కృష్ణ

ఇబ్రహీంపట్నం: కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలు కారల్ మార్క్స్, ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ రచించిన కమ్యూనిస్టు మేనిఫెస్టో ప్రచురణ దినోత్సవాన్ని పురస్కరించుకొని “రెడ్ బుక్ డే” కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సామ్రాజ్యవాదం అత్యున్నత దశ గ్రంథంపై అధ్యయనం చేశారు.

కార్యక్రమంలో సీపీఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డి.వి. కృష్ణ మాట్లాడుతూ, సామ్రాజ్యవాద విధానాల వల్ల సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై సమాజంలో అసమానతలు పెరుగుతున్నాయని అన్నారు. కార్మిక హక్కులు బలహీనపరచడం, సామాజిక న్యాయాన్ని నిర్వీర్యం చేయడం, అభ్యుదయ ఆలోచనలను అణచివేయడం జరుగుతోందని విమర్శించారు.

అంతర్జాతీయ ఆర్థిక విధానాల ప్రభావంతో దేశంలోని వ్యాపార, విద్య, ఔషధ రంగాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ధరల పెరుగుదల, విద్యుత్ చార్జీల భారంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు భారీ సబ్సిడీలు అందజేస్తూ సామాన్యులపై భారాలు మోపుతున్న విధానాలను ఖండించారు.

కమ్యూనిస్టు ప్రభుత్వాల ద్వారా మాత్రమే అసమానతలను తగ్గించి, అందరికీ ఉపాధి, విద్య, వైద్యం, మౌలిక వసతులు కల్పించవచ్చని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని, భవిష్యత్తులో ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎం. మహేష్, సీనియర్ నాయకులు, టౌన్ కమిటీ సభ్యులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

సామ్రాజ్యవాదం వల్లే అసమానతలు – కమ్యూనిస్టు విధానాలతోనే ప్రజలకు మౌలిక వసతులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News