Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:47 AM

సాకరే మారుతీరావుకు టిడిపి నేతల సత్కారం

సాకరే మారుతీరావుకు టిడిపి నేతల సత్కారం

సాకరే మారుతీరావుకు టిడిపి నేతల సత్కారం
01-04-2026 131 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని నియోజకవర్గంలో టిడిపి ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు లను స్వకుల సాలె సమాజానికి చెందిన సాకరే మారుతీరావు మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిసి సన్మానించారు.

ఈ సందర్భంగా సాకరే మారుతీరావు మాట్లాడుతూ… మార్చి 29న నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీకి సేవలందించిన కార్యకర్తలను విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసంలో గౌరవించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా సన్మానం అందుకోవడం జీవితాంతం గుర్తుండిపోయే ఘనతగా అభివర్ణించారు.

ఇలాంటి గౌరవం లభించడానికి సహకరించిన మీనాక్షి నాయుడు, ఉమాపతి నాయుడు లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సన్మానితులకు అభినందనలు తెలిపారు.

Sthanikam

సాకరే మారుతీరావుకు టిడిపి నేతల సత్కారం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News