Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:26 AM

రూ.10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం నిందితుడి అరెస్ట్

29-05-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, న్యూస్‌టుడే: ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించిన మోటార్ సైకిళ్ల కేసును పోలీసులు ఛేదించారు. రూ.10 లక్షల విలువైన 12 బైక్‌లను స్వాధీనం చేసుకుని ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు.

టూ టౌన్ సీఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం ఆదోని పట్టణంలోని లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా బైక్‌పై వెళ్తున్న కర్నూలు జిల్లా హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31)ను అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో నిందితుడు ఆదోని వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, ఆదోని తాలూకా, పత్తికొండతో పాటు వివిధ పోలీస్ స్టేషన్ పరిధుల్లో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు.

నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఆదోని–ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలోని రహస్య ప్రదేశంలో దాచిన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని తెలిపారు.

నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.

Sthanikam

రూ.10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం నిందితుడి అరెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News