Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఆర్ వివరాల నమోదులో అప్రమత్తంగా ఉండాలి: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి అంజయ్య న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:12 PM

రోడ్డు భద్రత నిబంధనలు తప్పక పాటించాలి: ఎస్సై

22-07-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి బాధ్యత కీలకమని ఎస్సై పేర్కొన్నారు. మండలంలోని తుంగతుర్తి గ్రామంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించాలని సూచించారు. అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.పాదచారులు జీబ్రా క్రాసింగ్‌ల వద్ద మాత్రమే రోడ్డు దాటాలని, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు సూచికలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వాహనం నడిపే ముందు బ్రేకులు,లైట్లు తదితర భద్రతా పరికరాలను పరిశీలించుకోవాలని తెలిపారు.రోడ్డు భద్రత పోలీసుల ఒక్కరి బాధ్యత కాదని, ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రత నిబంధనలు తప్పక పాటించాలి: ఎస్సై

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News