Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీటీడీ కల్యాణ మండపం భూమికి హద్దుల నిర్ణయం. న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:38 PM

రోడ్డు భద్రత... అందరి బాధ్యత: ట్రాఫిక్ సిఐ వెంకటేష్

23-07-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన సదస్సు

రోడ్డు విస్తరణ పనుల వేళ వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి

ప్రయాణాల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాలకే ముప్పు తెస్తుందని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ నందగిరి వెంకటేష్ అన్నారు. జిల్లా ఎస్పీ, డివిజన్ ట్రాఫిక్ డీఎస్పీల ఆదేశాల మేరకు బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, స్థానికులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

​నారాయణపురం ఎక్స్ రోడ్డు వద్ద సీఐ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో సీటుబెల్టు తప్పనిసరిగా ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రస్తుతం పట్టణంలో జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నందున, వాహనదారులు హెచ్చరిక బోర్డులను గమనిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటో యూనియన్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రత... అందరి బాధ్యత: ట్రాఫిక్ సిఐ వెంకటేష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News