Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూమ్నూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ సంజీవ్ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:26 PM

రెడ్లరేపాక గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీడీవో జలంధర్ రెడ్డి

29-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
వలిగొండ స్థానికం ప్రధాన ప్రతినిధి

వలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. జలెండర్ రెడ్డి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ దేశాబోయిన బాలస్వామి, గ్రామ కార్యదర్శితో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని హైస్కూల్లో నిర్మాణంలో ఉన్న కాంపౌండ్ వాల్ పనులను పరిశీలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. అమృతం తెలిపిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి సిబ్బంది హాజరు రిజిస్టర్లు, ఆహార నిల్వలు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. పిల్లలతో నేరుగా మాట్లాడి భోజనం నాణ్యతపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో వంద శాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో చేరేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు.

Sthanikam

రెడ్లరేపాక గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీడీవో జలంధర్ రెడ్డి

Article Image
వలిగొండ స్థానికం ప్రధాన ప్రతినిధి

వలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. జలెండర్ రెడ్డి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ దేశాబోయిన బాలస్వామి, గ్రామ కార్యదర్శితో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని హైస్కూల్లో నిర్మాణంలో ఉన్న కాంపౌండ్ వాల్ పనులను పరిశీలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. అమృతం తెలిపిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి సిబ్బంది హాజరు రిజిస్టర్లు, ఆహార నిల్వలు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. పిల్లలతో నేరుగా మాట్లాడి భోజనం నాణ్యతపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో వంద శాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో చేరేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News