Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:49 AM

రాయరావుపేటకు తాగునీటి ఊరట. రూ.4 లక్షలతో బోరు.. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కు గ్రామస్తుల కృతజ్ఞతలు.

19-07-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీబీనగర్, జూలై 19: మండలంలోని రాయరావుపేట గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రూ.4 లక్షలు మంజూరు చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆదివారం గ్రామంలో బోరు తవ్వకాలు ప్రారంభించారు.

గ్రామంలో తీవ్రంగా ఉన్న మంచినీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించి నిధులు విడుదల చేయడం పట్ల గ్రామ ప్రజల తరఫున సర్పంచ్ బొర్ర రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగేలా చర్యలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శివ నాగరాజు గౌడ్, వార్డు సభ్యులు, పీఏసీఎస్ డైరెక్టర్ రంగోల్ల శ్రీనివాస్, రంగోల్ల సతీష్, కలకొండ జయప్రకాష్తో పాటు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

రాయరావుపేటకు తాగునీటి ఊరట. రూ.4 లక్షలతో బోరు.. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కు గ్రామస్తుల కృతజ్ఞతలు.

Article Image

బీబీనగర్, జూలై 19: మండలంలోని రాయరావుపేట గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రూ.4 లక్షలు మంజూరు చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆదివారం గ్రామంలో బోరు తవ్వకాలు ప్రారంభించారు.

గ్రామంలో తీవ్రంగా ఉన్న మంచినీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించి నిధులు విడుదల చేయడం పట్ల గ్రామ ప్రజల తరఫున సర్పంచ్ బొర్ర రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగేలా చర్యలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శివ నాగరాజు గౌడ్, వార్డు సభ్యులు, పీఏసీఎస్ డైరెక్టర్ రంగోల్ల శ్రీనివాస్, రంగోల్ల సతీష్, కలకొండ జయప్రకాష్తో పాటు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News