Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:58 PM

రవాణా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం.....

25-02-2026 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

రవాణా రంగ సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడదాం.....

ఫిట్‌నెస్ ఛార్జీల పెంపు రవాణా రంగంపై కోలుకోలేని దెబ్బ.....

ఏఐఎంటీసీ ఉపాధ్యక్షులు వై. ఈశ్వరరావు.....

కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంపై చిన్నచూపు చూస్తూ, కార్పొరేట్ కంపెనీలకు వంత పాడుతోందని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వై. ఈశ్వరరావు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యలో కోదాడ లారీ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. స్వయం ఉపాధి పొందుతున్న చిన్న, చిన్న లారీ యజమానులు, డ్రైవర్ల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చలగటం అడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.10 ఏళ్లు దాటిన వాహనాలు తిరగకూడదనే కుట్రతో ఫిట్‌నెస్ ఛార్జీల పేరిట రూ. 33 వేల వరకు వసూలు చేయడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తాము హైకోర్టు ద్వారా స్టే తెచ్చుకుని వెయ్యి రూపాయలే చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిట్‌నెస్ ఛార్జీలను తగ్గించి, పాత పద్ధతిలోనే వెయ్యి రూపాయలకే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు.ఇంధన ధరల పెరుగుదల, అధిక టోల్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ప్రీమియంల భారం రవాణా రంగాన్ని కుదేలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తిరుకు నిరసనగా ఐక్యంగా పోరాడుదాం అని పిలుపునిచ్చారు. అనంతరం వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్, ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ మేనేజింగ్ కమిటీ మెంబర్ రామినేని శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ ప్రధాన సలహాదారు,ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ మేనేజింగ్ కమిటీ మెంబర్ ఆవుల రామారావు, కోదాడ అసోసియేషన్ అధ్యక్షులు తూణం కృష్ణ, సెక్రటరీ యలమందల నరసయ్య,మాజీ అధ్యక్షులు గుండపనేని నాగేశ్వరరావు,ఉపాధ్యక్షులు చంద్రమౌళి, బాబా, కోటయ్య, గౌస్ తదితరులు లారీ యజమానులు పాల్గొన్నారు....

Sthanikam

రవాణా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం.....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News