Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:46 AM

రాష్ట్ర బడ్జెట్‌లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలి: డీవైఎఫ్‌ఐ

14-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించి యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. శనివారం నల్లగొండలోని డీవైఎఫ్‌ఐ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రుణాల ద్వారా ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజీవ్ యువ వికాస్ పథకాన్ని వెంటనే అమలు చేసి అర్హులైన నిరుద్యోగులకు రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.

రానున్న బడ్జెట్ సమావేశాల్లో యువజన రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ అధిక నిధులు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమావేశంలో డీవైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, నాయకులు పోకల శశిధర్, ఖమ్మంపాటి ఆంజనేయులు, రాము, కార్తీక్, యాదగిరి, శివ, రఘు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాష్ట్ర బడ్జెట్‌లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలి: డీవైఎఫ్‌ఐ

Article Image

రానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించి యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. శనివారం నల్లగొండలోని డీవైఎఫ్‌ఐ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రుణాల ద్వారా ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజీవ్ యువ వికాస్ పథకాన్ని వెంటనే అమలు చేసి అర్హులైన నిరుద్యోగులకు రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.

రానున్న బడ్జెట్ సమావేశాల్లో యువజన రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ అధిక నిధులు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమావేశంలో డీవైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, నాయకులు పోకల శశిధర్, ఖమ్మంపాటి ఆంజనేయులు, రాము, కార్తీక్, యాదగిరి, శివ, రఘు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News