Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నకిరేకల్‌ 100 పడకల ఆసుపత్రి.. క్రెడిట్‌ ఎవరిది? ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 12:30 PM

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత..

30-03-2026 182 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

రోడ్డు భద్రతపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అవగాహన..

పోలీసు కళాబృందంతో వినూత్నంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం..

ఆకట్టుకున్న యమధర్మరాజు వేషధారణ..

నల్గొండ : రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ పట్టణ క్లాక్ టవర్ సెంటర్లో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అతివేగం, అజాగ్రత్త మరియు ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించినప్పుడే ప్రమాదాల రహిత జిల్లాగా తీర్చిదిద్దగలమని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ కళాబృందం నిర్వహించిన ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యమధర్మరాజు వేషధారణలో కళాకారులు రహదారిపైకి వచ్చి, హెల్మెట్ ధరించని వాహనదారులకు కలిగే ప్రమాదాలను వివరించడం అందరినీ ఆలోచింపజేసింది. చిన్నారులు తమ నృత్యాల ద్వారా రోడ్డు భద్రతా సందేశాలను ప్రజలకు చేరవేశారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాద సమయాల్లో ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ సూచించారు.

ముఖ్యంగా యువత అతివేగంతో వాహనాలు నడపడం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలకు రోడ్డు భద్రతపై తగిన మార్గదర్శకత్వం ఇవ్వాలని ఎస్పీ కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు తమ వెంట అవసరమైన పత్రాలను ఉంచుకోవాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లు వాడకూడదని హితవు పలికారు. రాబోయే రోజుల్లో విద్యాసంస్థలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐలు రాము, రాజశేఖర్ రెడ్డి, మహాలక్ష్మయ్య, కరుణాకర్, ఎస్సైలు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News