Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:07 AM

రామతీర్థం పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన సర్పంచ్

07-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్ మండలంలోని రామతీర్థం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కూర్చొని భోజనం చేసి ఆహారం నాణ్యతను పరిశీలించారు. భోజనం పరిశుభ్రంగా ఉండటం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థుల చదువు స్థాయి గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన బోధనతో పాటు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించిందని తెలిపారు.అలాగే విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు మాధవి, గ్రామ యువ నాయకులు సందీప్, శ్రీకాంత్, గ్రామస్తులు గోరేమియా, సంజీవులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

రామతీర్థం పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన సర్పంచ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News