Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:42 PM

రామన్నపేటలో ఉద్రిక్తత… తెలంగాణ ఉద్యమ నాయకుల అరెస్టులు

30-03-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ చాంద్‌ను రామన్నపేట టౌన్ పోలీసులు అరెస్టు చేయగా, తెలంగాణ ఉద్యమ నాయకుడు బొడ్డుపల్లి లింగయ్యను హౌస్ అరెస్టు చేశారు.

అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తమ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని షేక్ చాంద్ వాదించినప్పటికీ, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం వాయిదా వేసినప్పటికీ, ముందస్తు జాగ్రత్త చర్యగా బోగారం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి లింగయ్యను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

ఈ పరిణామాలతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ నాయకుల అరెస్టులను ఖండిస్తూ ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Sthanikam

రామన్నపేటలో ఉద్రిక్తత… తెలంగాణ ఉద్యమ నాయకుల అరెస్టులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News