Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:47 AM

రామన్నపేటలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

29-03-2026 109 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలి.రాపోలు నరసింహా

రామన్నపేట మండలంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ శాఖ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించాలనే లక్ష్యంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ పార్టీపై ప్రజల్లో అపారమైన గౌరవం ఉందన్నారు. అనేక మంది నాయకులు ఈ పార్టీ ద్వారా ఎదిగారని, కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే రాజకీయ విశ్వవిద్యాలయం ఇదేనని పేర్కొన్నారు.

ప్రపంచ స్థాయి విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడం గర్వకారణమని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణలో కూడా పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత బలోపేతం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల అధ్యక్షుడు మీర్జా ఫజల్ బేగ్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నకిరేకంటి గణేష్, మండల ఉపాధ్యక్షుడు బత్తుల సత్యం, నాయకులు గాదజానీ, గంజి వీరయ్య, కొంపెల్లి వీరేశం, నరసింహ, మోటే రాజు, గొప్పల నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News