Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:44 AM

రామన్నపేటలో జాతీయ లోక్ అదాలత్‌కు సన్నాహక సమావేశం

14-03-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మార్చి 28న జాతీయ లోక్ అదాలత్

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ గౌరవ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి A. జయరాజు సూచనల మేరకు రామన్నపేటలోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాల్‌లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ నెల 28-03-2026న నిర్వహించబడనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

సమావేశానికి V. మాధవి లత , మండల న్యాయ సేవా సమితి చైర్‌పర్సన్ మరియు సీనియర్ సివిల్ జడ్జి G. సబితా , ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి S. శిరీష , రెండవ తరగతి మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి D. సత్తయ్య పాల్గొన్నారు.

అదేవిధంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు APP నిజముద్దీన్ , అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ S. శ్రవణ్ కుమార్ , బార్ అసోసియేషన్ అధ్యక్షుడు M. A. మజీద్ , బార్ సభ్యులు, ప్యానల్ అడ్వకేట్లు M. వెంకట్రె డ్డి , B. డేవిడ్పా ల్గొన్నారు.

పోలీస్ విభాగం నుంచి రామన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ N. వెంకటేశ్వర్లు , మోత్కూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ C. వెంకటేశ్వర్లు , వలిగొండ సబ్ ఇన్‌స్పెక్టర్ V. యుగేందర్ , అడ్డగూడూరు సబ్ ఇన్‌స్పెక్టర్ K. వెంకట్ రెడ్డి , రామన్నపేట ఏఎస్‌ఐ సురేందర్ , ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ శివకృష్ణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా 28-03-2026న నిర్వహించబడనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, పెండింగ్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించే విధానాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ కేసులను స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని న్యాయమూర్తులు సూచించారు.

లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా న్యాయవాదులు, పోలీసు యంత్రాంగం పూర్తి సహకారం అందించాలని సూచించారు. రాజీకి అనుకూలమైన కేసుల కక్షిదారులకు ముందస్తుగా నోటీసులు అందజేయాలని, రామన్నపేట కోర్టు పరిధిలోని గ్రామాల్లో లోక్ అదాలత్‌పై విస్తృత ప్రచారం చేపట్టాలని పోలీసు అధికారులకు సూచనలు ఇచ్చారు. కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ వరకు ప్రతి రోజు ప్రీ-సిట్టింగ్స్ నిర్వహించబడతాయని తెలిపారు.

Sthanikam

రామన్నపేటలో జాతీయ లోక్ అదాలత్‌కు సన్నాహక సమావేశం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News