Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:25 AM

రామన్నపేటలో బీజేపీ బిఎల్ఏ-2 కార్యశాల

రామన్నపేటలో బీజేపీ బిఎల్ఏ-2 కార్యశాల

రామన్నపేటలో బీజేపీ బిఎల్ఏ-2 కార్యశాల
18-04-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బూత్ లెవల్ అసిస్టెంట్స్ (బిఎల్ఏ-2) మండల కార్యశాల నిర్వహించారు. మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నకిరేకల్ అసెంబ్లీ ఇన్‌చార్జ్ నకిరేకంటి మొగులయ్య, మండల ఇన్‌చార్జ్ కొరివి శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 25న కట్టంగూరు మండలంలో జరగనున్న నకిరేకల్ నియోజకవర్గ స్థాయి బిఎల్ఏ-2 సమావేశాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని వారు తీవ్రంగా విమర్శించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే సంకల్పంతో బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకంగా వ్యవహరించడం మహిళల పట్ల అవమానకరమని అన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాధాన్యం కల్పించడంలో కాంగ్రెస్ ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వనం అంజయ్య, సీనియర్ నాయకులు డోగ్పర్తి సుభాష్, కట్ట యాదయ్య, యువమోర్చా జిల్లా కార్యదర్శి అక్కినపల్లి సైదులు, మండల ప్రధాన కార్యదర్శులు జంగిలి సత్యనారాయణ, బెజ్జంకి శివకుమార్, ఉపాధ్యక్షులు బట్టే రమేష్, గజ్జల రాము, కార్యదర్శి బందెల సంజీవ, కోశాధికారి గురుకు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అలాగే పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Sthanikam

రామన్నపేటలో బీజేపీ బిఎల్ఏ-2 కార్యశాల

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News