Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:40 AM

రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం కావాలి. ప్రజల ఐక్యతతోనే సాధ్యం: నకిరేకంటి గణేష్

02-04-2026 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ఏప్రిల్ 2: రామన్నపేట ప్రాంత అభివృద్ధి దృష్ట్యా ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరు పార్టీ భేదాలు పక్కనబెట్టి ఐక్యంగా పోరాడాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు నకిరేకంటి గణేష్ పిలుపునిచ్చారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, డీఎస్పీ పార్టీలు కూడా ముందుకు రావాలని ఆయన కోరారు.

ప్రత్యేక నియోజకవర్గ సాధనే ప్రధాన లక్ష్యంగా ప్రతి పౌరుడు భావించి ఉద్యమంలో భాగస్వాములు కావాలని, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేతలు, మహిళలు చురుకుగా పాల్గొనాలని సూచించారు.

ఉద్యమ విజయానికి పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా ముందుండాలని అన్నారు.

రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం సాధన కోసం అందరూ ఒక్కటై పోరాడితే లక్ష్యం తప్పకుండా నెరవేరుతుందని గణేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం కావాలి. ప్రజల ఐక్యతతోనే సాధ్యం: నకిరేకంటి గణేష్

Article Image

రామన్నపేట, ఏప్రిల్ 2: రామన్నపేట ప్రాంత అభివృద్ధి దృష్ట్యా ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరు పార్టీ భేదాలు పక్కనబెట్టి ఐక్యంగా పోరాడాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు నకిరేకంటి గణేష్ పిలుపునిచ్చారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, డీఎస్పీ పార్టీలు కూడా ముందుకు రావాలని ఆయన కోరారు.

ప్రత్యేక నియోజకవర్గ సాధనే ప్రధాన లక్ష్యంగా ప్రతి పౌరుడు భావించి ఉద్యమంలో భాగస్వాములు కావాలని, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేతలు, మహిళలు చురుకుగా పాల్గొనాలని సూచించారు.

ఉద్యమ విజయానికి పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా ముందుండాలని అన్నారు.

రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం సాధన కోసం అందరూ ఒక్కటై పోరాడితే లక్ష్యం తప్పకుండా నెరవేరుతుందని గణేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News