Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:09 PM

రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణకు ఘన సన్మానం

06-03-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణను ఉపసర్పంచ్ మోటే రమేష్‌తో పాటు పాలకవర్గాన్ని రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి గౌరవాధ్యక్షుడు రెబ్బాసు రాములు ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా రెబ్బాసు రాములు మాట్లాడుతూ రామన్నపేట ఒకప్పుడు ఇబ్రహీంపట్నం నుంచి ఆలేరు వరకు, నల్గొండ నుంచి శాలిగౌరారం వరకు సమితి కేంద్రంగా ఉండేదని తెలిపారు. 1952 నుంచి 2009 వరకు రామన్నపేట నియోజకవర్గ కేంద్రంగా కొనసాగిందని, అనంతరం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నకిరేకల్ నియోజకవర్గంలో కలిపినట్లు పేర్కొన్నారు.

రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతో కలిసి రామన్నపేట నియోజకవర్గ సాధన సమితిని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకు వినతిపత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో మండల వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను సన్మానిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రామన్నపేట నియోజకవర్గ సాధన సమితికి మద్దతు ఇవ్వాలని కోరారు.

అనంతరం సర్పంచ్ గరిక సత్యనారాయణ సాధన సమితి గౌరవాధ్యక్షుడు రెబ్బాసు రాములను శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సాధన సమితి నాయకులు గడ్డం యాదగిరి, బందెల అశోక్, ఎండీ ఇమామ్ సాబ్, నకిరేకంటి నరేష్, పెండెం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణకు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News