Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:28 AM

రామన్నపేట నుంచి భారీగా తరలిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం

18-04-2026 128 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు, కార్యకర్తలు తార్నాకలో నిర్వహించిన సమావేశానికి భారీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఎస్కే చాంద్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా ఎస్కే చాంద్ మాట్లాడుతూ ఉద్యమకారుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రధానంగా ఈ క్రింది డిమాండ్లు వెల్లడించారు: ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం కేటాయించడం, నెలకు రూ.25 వేల పింఛన్ ఇవ్వడం, నిజమైన ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయడం, రూ.50 లక్షల వరకు వైద్య సదుపాయం కల్పించడం, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను గుర్తించి ఆదుకోవడం, అలాగే ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఫోరం మండల అధ్యక్షులు నోముల శంకర్, ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి ఇమామ్ (బోగారం మాజీ ఉపసర్పంచ్), రాష్ట్ర నాయకులు గడ్డం యాదగిరి, ఉద్యమ నాయకులు మందడి రవీందర్ రెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షులు మద్దగల నరసింహ, కొండ మల్లేశం గౌడ్ , కైరం కొండ సంతోష్, వంగాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట నుంచి భారీగా తరలిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News