Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:37 AM

రామన్నపేట నియోజకవర్గ సాధనకు వాల్ పోస్టర్ ఆవిష్కరణ

03-04-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్ వద్ద నియోజకవర్గ సాధనకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రామన్నపేటను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలనే ఆకాంక్ష ప్రజల్లో, ప్రజాప్రతినిధుల్లో విస్తృతంగా ఉందన్నారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరై మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

కొంతమంది నాయకులు వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేకపోయినా, వారి మద్దతు ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గ సాధన కోసం ఒక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, అన్ని పార్టీలతో కలసి ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు.

త్వరలోనే ఎంపీలు, కేంద్ర మంత్రులను కలుసుకోవడం, ప్రజాక్షేత్రంలో నిరాహార దీక్షలు, ర్యాలీలు వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. సామాజిక మాధ్యమాలు సహా అన్ని మార్గాల్లో ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పోచబోయిన మల్లేశం, పోతరాజు శంకరయ్య, వర్కాల గోపాల్, నకరికంటి అశోక్, సాల్వేరు అశోక్, ఎస్‌కే చాంద్, గడ్డం యాదగిరి, ఎండి ఫజల్, కూనూరు కృష్ణ, జెట్టి శివప్రసాద్, గొలుసుల ప్రసాద్, గంగాపురం యాదయ్య, కూనూరు శ్రీనివాస్, పున్న వెంకటేశం, సంగిశెట్టి సుదర్శన్, రేఖ యాదయ్య, రచ్చ యాదగిరి, దండుగుల రాములు, నకిరెకంటి నరేష్, నకిరెకంటి నరేందర్, బాలగోని గణేష్, ఎర్ర బిక్షపతి, బాలగోని మల్లయ్య, ఎర్ర నర్సయ్య, పెండెం రవీందర్, రామోజీ నరసింహాచారి, కోట సుధాకర్, ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట నియోజకవర్గ సాధనకు వాల్ పోస్టర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News