Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:20 PM

రామన్నపేట మార్కెట్‌లో నకిలీ సిగరెట్ల హవా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం – అధికారులు మౌనం!

01-04-2026 155 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో నకిలీ సిగరెట్ల దందా రోజురోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. అనుమతి లేకుండా, నాణ్యతలేని సిగరెట్లను కొన్ని అసాంఘిక శక్తులు అసలు బ్రాండ్ల పేర్లతో మార్కెట్లోకి తెచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం. వీటి ద్వారా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న పరిస్థితి నెలకొంది.

మార్కెట్లో చలామణి అవుతున్న ఈ నకిలీ సిగరెట్లలో ఉపయోగించే పొగాకు, రసాయనాలు ప్రమాదకరమైనవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి వినియోగించడం వల్ల ఊపిరితిత్తులు సహా శరీరంలోని ఇతర అవయవాలకు తీవ్రమైన హాని కలిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

తక్కువ ధరకు లభిస్తున్న ఈ నకిలీ ఉత్పత్తులవైపు ముఖ్యంగా యువత ఆకర్షితులవుతున్నారు. అసలు-నకిలీ తేడా తెలియకుండానే కొనుగోలు చేస్తూ అనారోగ్య సమస్యలను ఆహ్వానించుకుంటున్నారు. ఇప్పటికే సిగరెట్ వినియోగమే ఆరోగ్యానికి హానికరం కాగా, నకిలీ ఉత్పత్తులు మరింత ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి.

ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. మార్కెట్లో బహిరంగంగానే విక్రయాలు కొనసాగుతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇలాంటి అక్రమ వ్యాపారాలను అరికట్టేందుకు తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలోని కిరాణా దుకాణాలు, ఇతర విక్రయ కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నకిలీ సిగరెట్ల విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని, అలాగే నకిలీ నిత్యావసర వస్తువులపై కూడా దృష్టి సారించి చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Sthanikam

రామన్నపేట మార్కెట్‌లో నకిలీ సిగరెట్ల హవా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం – అధికారులు మౌనం!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News