Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:03 PM

రామలింగేశ్వరుని సన్నిధిలో సర్పంచ్ దంపతుల ప్రత్యేక పూజలు

18-01-2026 146 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అమావాస్య వేళ గుట్టపై రామలింగేశ్వరునికి మహాపూజలు.. భక్తులతో కిటకిటలాడిన ఆలయం

చిట్యాల స్థానికం ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్

చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులోని గుట్టపై శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఆదివారం అమావాస్య సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న నర్సింహ గౌడ్ దంపతులు స్వామివారికి అభిషేకాలు, గోత్రనామార్చనలు, ప్రత్యేక పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.వేదమంత్రోచ్చారణల మధ్య అర్చకులు పూజలు కొనసాగించగా, భక్తులకు తీర్థప్రసాదాలు అందించి స్వామివారి ఆశీర్వచనాలు ప్రసాదించారు. అనంతరం కీ.శే. బత్తుల సాలయ్య గౌడ్–సత్తమ్మ దంపతుల పవిత్ర స్మృతికి గుర్తుగా వారి కుమారుడు, కోడలు అయిన సర్పంచ్ దంపతులు గుట్టపై భక్తులకు విస్తృతంగా అన్నదానం ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న నర్సింహ గౌడ్ మాట్లాడుతూ శ్రీ రామలింగేశ్వర స్వామి అనంత కృపతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షించారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనంతో పునీతులయ్యారు.

Sthanikam

రామలింగేశ్వరుని సన్నిధిలో సర్పంచ్ దంపతుల ప్రత్యేక పూజలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News