Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 11:16 AM

రక్తదానం.. ప్రాణదానానికి ముందడుగు

రక్తదానం.. ప్రాణదానానికి ముందడుగు

రక్తదానం.. ప్రాణదానానికి ముందడుగు
20-07-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని గట్టు శ్రీరాములు గార్డెన్‌లో ఆయాన్స్ భార్గవ్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా రక్తదాన శిబిరాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "రక్తదానం మహాదానం.. ఒకరు చేసిన రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడగలదు" అని అన్నారు. యువత సామాజిక బాధ్యతగా భావించి స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాల్లో పాల్గొని మరెందరికో ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన యువకులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించి, వారి సేవాభావాన్ని ప్రశంసించారు. సమాజానికి మేలు చేసే ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆయాన్స్ భార్గవ్ సేవ ట్రస్ట్ నిర్వాహకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ట్రస్ట్ సభ్యులు, యువత, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

రక్తదానం.. ప్రాణదానానికి ముందడుగు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News