Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీఎంజేఎఫ్ మూడవ రాష్ట్ర మహాసభలకు కరపత్రికల ఆవిష్కరణ. ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 12:37 AM

రాజాపేటలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్, రెసిడెన్షియల్ పాఠశాల పరిశీలన

13-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాజాపేట,: మండల కేంద్రంలోని నర్సరీని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. ఈ సందర్భంగా మొత్తం ఎన్ని మొక్కలు నాటారు, వాటిలో ఏ ఏ రకాల మొక్కలు ఉన్నాయనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నర్సరీలో మొక్కలకు ప్రతిరోజూ నీరు పోస్తూ సంరక్షణ తీసుకోవాలని సూచించారు. నర్సరీని ఆహ్లాదకరమైన వాతావరణంగా తీర్చిదిద్దాలని అధికారులకు తెలిపారు.

తదనంతరం మండల కేంద్రంలోని అవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించిన కలెక్టర్ మొక్కలు నాటి వదిలేశారని, సరైన విధంగా నీరు పోయడం లేదని గమనించి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్ల చుట్టూ గుంతలు తీసి ప్రతిరోజూ నీరు పోయాలని, చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఎఫ్‌ఏకు ఆదేశించారు.

అనంతరం రాజాపేట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని కిచెన్‌ను పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు ఏ భోజనం అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యత, స్టోరేజ్ గదులు, వంటకు ఉపయోగించే సరుకులను పరిశీలించారు. గుడ్లు, కూరగాయలు తాజాగా ఉండేలా చూడాలని సూచించారు.

విద్యార్థుల డార్మెటరీలను కూడా పరిశీలించి పడుకునే బెడ్‌లు సక్రమంగా ఉన్నాయా అని తనిఖీ చేశారు. విద్యార్థులు ఉపయోగించే టాయిలెట్లను పరిశీలించి ప్రతిరోజూ శుభ్రం చేయాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

రాజాపేటలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్, రెసిడెన్షియల్ పాఠశాల పరిశీలన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News