Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:47 AM

రాజాపేట పీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ రోగులకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించాలి.

13-03-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాజాపేట,: మండలంలోని రాజాపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అన్ని రకాల వైద్య సేవలు సమర్థంగా అందించాలని వైద్యాధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పీహెచ్‌సీకి రోజూ ఎంతమంది రోగులు వస్తున్నారు, ఎంతమంది గర్భిణులు వైద్య సేవలు పొందుతున్నారు అనే విషయాలను ఆరా తీశారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, పరీక్షల అనంతరం ఇచ్చే చికిత్స, మందుల వివరాలను కూడా రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు.

ఆస్పత్రిలోని ల్యాబ్, మెడికల్ స్టోర్, లేబర్ రూమ్‌లను పరిశీలించారు. గత నెలలో జరిగిన డెలివరీల వివరాలు అడిగి తెలుసుకుని, సాధ్యమైనంత ఎక్కువగా సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.

అదేవిధంగా ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారు ఏ సమస్యతో వచ్చారో తెలుసుకున్నారు. అందుతున్న వైద్య సేవలపై వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు

Sthanikam

రాజాపేట పీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ రోగులకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించాలి.

Article Image

రాజాపేట,: మండలంలోని రాజాపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అన్ని రకాల వైద్య సేవలు సమర్థంగా అందించాలని వైద్యాధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పీహెచ్‌సీకి రోజూ ఎంతమంది రోగులు వస్తున్నారు, ఎంతమంది గర్భిణులు వైద్య సేవలు పొందుతున్నారు అనే విషయాలను ఆరా తీశారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, పరీక్షల అనంతరం ఇచ్చే చికిత్స, మందుల వివరాలను కూడా రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు.

ఆస్పత్రిలోని ల్యాబ్, మెడికల్ స్టోర్, లేబర్ రూమ్‌లను పరిశీలించారు. గత నెలలో జరిగిన డెలివరీల వివరాలు అడిగి తెలుసుకుని, సాధ్యమైనంత ఎక్కువగా సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.

అదేవిధంగా ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారు ఏ సమస్యతో వచ్చారో తెలుసుకున్నారు. అందుతున్న వైద్య సేవలపై వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News