Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:13 PM

రైతులకు ఇబ్బందులు లేకుండా టోకెన్ విధానంలో కొనుగోళ్లు: అదనపు కలెక్టర్ వెంకారెడ్డి

04-03-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రబీ వరి కొనుగోళ్లకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

భువనగిరి: రబీ 2025–26 వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల వద్ద టోకెన్ పద్ధతిలో ధాన్యం స్వీకరించి సక్రమంగా సేకరణ జరిగేలా చూడాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఎత్తుపల్లాలు పరిశీలించి సరైన ప్రదేశాలను ఎంపిక చేయాలని సూచించారు.

కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వేయింగ్ మెషీన్లు, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు, తగినన్ని గన్నీ బ్యాగులు, టార్పాలిన్ షీట్లు సిద్ధంగా ఉంచాలని, ప్రతి కేంద్రానికి కనీసం 50 టార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు.

వేసవి దృష్ట్యా రైతులు, నిర్వాహకులు, సిబ్బందికి తాగునీరు, నీడ, షెడ్లు, టెంట్లు, కుర్చీలు వంటి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని పీపీసీ కేంద్రాల్లో తూకపు యంత్రాలు, తేమ యంత్రాలు మార్చి 15లోగా సంబంధిత అధికారులచే ధృవీకరించుకోవాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, జిల్లా సహకార అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా మార్కెటింగ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

రైతులకు ఇబ్బందులు లేకుండా టోకెన్ విధానంలో కొనుగోళ్లు: అదనపు కలెక్టర్ వెంకారెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News