Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 12:16 PM

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. ధర్మారెడ్డి కాలువతో వేలాది ఎకరాలకు సాగునీటి వరం" – ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్

21-07-2026 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గాల రైతుల చిరకాల ఆకాంక్ష అయిన ధర్మారెడ్డి కాలువ ద్వారా సాగునీటిని సోమవారం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జీరో పాయింట్ వద్ద నుంచి విడుదల చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేముల వీరేశం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ ధర్మారెడ్డి కాలువ పనులను వేగంగా పూర్తి చేశామని అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని కాలువల ఆధునీకరణ చేపట్టిందని తెలిపారు.

ఈ నీటితో భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో సాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్మారెడ్డి కాలువ పనులకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేసిందన్నారు. రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సాగునీటిని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.

Sthanikam

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. ధర్మారెడ్డి కాలువతో వేలాది ఎకరాలకు సాగునీటి వరం" – ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్

Article Image

భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గాల రైతుల చిరకాల ఆకాంక్ష అయిన ధర్మారెడ్డి కాలువ ద్వారా సాగునీటిని సోమవారం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జీరో పాయింట్ వద్ద నుంచి విడుదల చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేముల వీరేశం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ ధర్మారెడ్డి కాలువ పనులను వేగంగా పూర్తి చేశామని అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని కాలువల ఆధునీకరణ చేపట్టిందని తెలిపారు.

ఈ నీటితో భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో సాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్మారెడ్డి కాలువ పనులకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేసిందన్నారు. రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సాగునీటిని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News