Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ సారాంపల్లి మల్లారెడ్డి కి ఘననివాళులు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 06:52 PM

రైతులతో ఆటలాడొద్దు ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి..

04-04-2026 137 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నాయకుల ధ్వజం..

తిప్పర్తి మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాల పరిశీలన..

తిప్పర్తి : రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. శనివారం తిప్పర్తి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆ పార్టీ నాయకుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కందుల లక్ష్మయ్య, మాజీ మండల అధ్యక్షుడు శిరసవాడ సైదులు మాట్లాడారు. ఐకేపీ కేంద్రాలకు ధాన్యం వచ్చి నెల రోజులు కావస్తున్నా ఇంతవరకు కాంటాలు మొదలుపెట్టకపోవడం దారుణమని వారు విమర్శించారు. పీఏసీఎస్ (PACS) మరియు మహిళా సంఘాల మధ్య కావాలనే 'పంచాయతీ' పెట్టి గత వారం రోజులుగా కొనుగోలు ప్రక్రియను అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గతంలో ఇదే సమయానికి మండలం నుండి సుమారు 50 వేల క్వింటాళ్ల ధాన్యం సేకరణ జరిగేదని కానీ నేడు ఒక్క బస్తా కూడా కొనకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

మిల్లర్లతో కుమ్మక్కై మోసాలు..

​ప్రభుత్వ కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు గత్యంతరం లేక మిల్లర్లను ఆశ్రయిస్తున్నారని, దీనిని అదనుగా తీసుకుని మిల్లర్లు ధరలో కోత విధిస్తూ, తూకాల్లో మోసం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు, మిల్లర్లు కుమ్మక్కై రైతుల పొట్ట కొడుతున్నారని విమర్శించారు. అకాల వర్షాలు కురిస్తే ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయ్యే ప్రమాదం ఉందని, అప్పుడు రైతులకు జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. జిల్లా అధికారులు ఇప్పటివరకు మిల్లులకు ట్యాగింగ్ చేయలేదు. కనీసం ట్రాన్స్‌పోర్ట్ లారీ ఏజెన్సీని కూడా ఖరారు చేయకపోవడం రైతులను ఇబ్బంది పెట్టడమే. రాబోయే రెండు మూడు రోజుల్లోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించి, సేకరణ చేపట్టకపోతే రైతులతో కలిసి తిప్పర్తి మండల కేంద్రంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భైరగోని శ్రీనివాస్, గుర్రం వెంకట్ రెడ్డి, వల్లపురెడ్డి వెంకట్ రెడ్డి మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులతో ఆటలాడొద్దు ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News