Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:30 AM

రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి : లక్ష్మిరెడ్డి

29-05-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రైతాంగం సుదీర్ఘకాలంగా అతివృష్టి, అనావృష్టితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వ్యవసాయం భారంగా మారుతోందని ఏపీ రైతు సంఘం గౌరవాధ్యక్షుడు లక్ష్మిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని 104 బసాపురం గ్రామంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులకు కరపత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం నియోజకవర్గ గౌరవాధ్యక్షుడు లక్ష్మిరెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి బసాపురం గోపాల్ మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎరువులు, విత్తనాలు, వివిధ రకాల వ్యవసాయ పరికరాలను 90 శాతం రాయితీతో అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులను అరికట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది రైతులు నకిలీ విత్తనాలు, ఎరువుల వల్ల నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు.

వందలాది టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని, ప్రాజెక్టులు నిర్మించి ఆ నీటిని సాగుకు వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విదేశాల్లో జరుగుతున్న యుద్ధాలను సాకుగా చూపుతూ రసాయనిక ఎరువుల ధరలను భారీగా పెంచడం రైతులకు మరింత భారంగా మారిందన్నారు. వెంటనే ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

పంటలకు ఉచిత బీమా సదుపాయం కల్పించి, కౌలు రైతులకు కూడా బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతుకు భరోసా ఇవ్వాలన్నారు.

రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులను రూ.50 వేల వరకు పెంచి రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాల్లో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కోరారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, రైతుకు వ్యవసాయం భారమైతే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ప్రతి పాలకుడు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి దశలవారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకులు గుడిసి ఈరన్న, కరెంటు ఈరన్న, రైతులు, కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి : లక్ష్మిరెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News