స్థానికం ప్రతినిధి
ఖరారైన రైల్వే టికెట్ రిజర్వేషన్‌ను రద్దు చేసుకుంటే ఏ నిబంధనలు అమల్లో ఉంటాయనే విషయంపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. రైలు బయలుదేరే సమయానికి 48 గంటల ముందు టికెట్‌ను రద్దు చేస్తే కనీస రద్దు ఛార్జీని మినహాయించి మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.ఫస్ట్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ రద్దుకు రూ.240, ఏసీ సెకండ్ క్లాస్‌కు రూ.200, థర్డ్ ఏసీ, ఏసీ ఛైర్‌కార్, థర్డ్ ఏసీ ఎకానమీకి రూ.180, స్లీపర్ క్లాస్‌కు రూ.120, సెకండ్ క్లాస్ సిట్టింగ్‌కు రూ.60 రద్దు ఛార్జీగా వసూలు చేస్తారు.ఈ మొత్తాన్ని మినహాయించి మిగిలిన చార్జీని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తారని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు టికెట్ రద్దు నిబంధనలను ముందుగానే తెలుసుకొని ఇబ్బందులు లేకుండా వ్యవహరించాలని సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి