Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 11:48 AM

రైల్వే నోటీసులతో రోడ్డున పడుతున్నాం. నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి.

20-07-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆర్డీవోకు వినతిపత్రం అందజేసిన బాధితులు.

యాదాద్రి భువనగిరి,

రాయగిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఇళ్లు కోల్పోతున్న నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు సోమవారం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. రైల్వే శాఖ జారీ చేసిన ఖాళీ చేయాలనే నోటీసులతో తీవ్ర ఆందోళనకు గురయ్యామని వారు తెలిపారు.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తాము తరతరాలుగా అదే ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నామని, ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు, ఇతర చార్జీలు కూడా క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రైల్వే అధికారులు ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇళ్లు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించడంతో పాటు ప్రభుత్వం నిర్మించే ఇళ్లలో నివాసం, ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలందరికీ పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Sthanikam

రైల్వే నోటీసులతో రోడ్డున పడుతున్నాం. నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి.

Article Image

ఆర్డీవోకు వినతిపత్రం అందజేసిన బాధితులు.

యాదాద్రి భువనగిరి,

రాయగిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఇళ్లు కోల్పోతున్న నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు సోమవారం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. రైల్వే శాఖ జారీ చేసిన ఖాళీ చేయాలనే నోటీసులతో తీవ్ర ఆందోళనకు గురయ్యామని వారు తెలిపారు.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తాము తరతరాలుగా అదే ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నామని, ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు, ఇతర చార్జీలు కూడా క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రైల్వే అధికారులు ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇళ్లు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించడంతో పాటు ప్రభుత్వం నిర్మించే ఇళ్లలో నివాసం, ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలందరికీ పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News