Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీటీడీ కల్యాణ మండపం భూమికి హద్దుల నిర్ణయం. న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:17 PM

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ భారీ ధర్నా

22-07-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి,జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఆదేశాల మేరకు నారాయణఖేడ్ పట్టణంలోని ఇంద్రచౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేలా ప్రతిపక్ష నాయకులపై అక్రమ అరెస్టులు చేయడం తగదని, ప్రజల గొంతుకను అణచివేసే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదని అన్నారు. అలాగే నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు విద్యార్థుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ భారీ ధర్నా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News