Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ హామీలు అమలు చేయాలి.. ప్రజావాణిలో బీఆర్‌ఎస్‌ నాయకుల వినతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 12:42 PM

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా చిట్యాలలో మోదీ దిష్టిబొమ్మ దహనం

22-07-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ చిట్యాల పట్టణ కాంగ్రెస్ నాయకులు కనకదుర్గమ్మ సెంటర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దులపూరి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించారు.

ఈ సందర్భంగా ఎద్దులపూరి కృష్ణ మాట్లాడుతూ, దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు, అరెస్టులు చేయడం ద్వారా ప్రజల గొంతుకను అణిచివేయలేరని అన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పోకల దేవదాస్, జిల్లా నాయకులు పాటి నర్సిరెడ్డి, కౌన్సిలర్ దేశపాక లతా రాజేష్, జెర్రిపోతుల సత్యనారాయణ నాగిళ సుధాకర్, కో-ఆప్షన్ సభ్యుడు బేల్లి సత్తయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా చిట్యాలలో మోదీ దిష్టిబొమ్మ దహనం

Article Image

చిట్యాల: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ చిట్యాల పట్టణ కాంగ్రెస్ నాయకులు కనకదుర్గమ్మ సెంటర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దులపూరి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించారు.

ఈ సందర్భంగా ఎద్దులపూరి కృష్ణ మాట్లాడుతూ, దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు, అరెస్టులు చేయడం ద్వారా ప్రజల గొంతుకను అణిచివేయలేరని అన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పోకల దేవదాస్, జిల్లా నాయకులు పాటి నర్సిరెడ్డి, కౌన్సిలర్ దేశపాక లతా రాజేష్, జెర్రిపోతుల సత్యనారాయణ నాగిళ సుధాకర్, కో-ఆప్షన్ సభ్యుడు బేల్లి సత్తయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News