Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 02:26 PM

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్యానికి విరుద్ధం. రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన..

23-07-2026 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్.

రామన్నపేట,

నీట్ (NEET) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం, విద్యార్థుల నిరసనలకు మద్దతుగా ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ రామన్నపేట పట్టణంలోని జూనియర్ కళాశాల సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న జగన్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పున్న జగన్మోహన్ మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీతో దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నా కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై లాఠీచార్జ్ చేయడం దురదృష్టకరమన్నారు. విద్యార్థులకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు.

ఏఐసీసీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే చర్య అని ఆరోపించారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రశ్నాపత్రాల లీకేజీలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్యానికి విరుద్ధం. రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News