Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

రాబోయే రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

04-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

రాబోయే రంజాన్ పండుగను ప్రశాంతంగా, సామరస్య వాతావరణంలో నిర్వహించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హాలులో వివిధ శాఖల అధికారులు ముస్లిం మత పెద్దలు,వివిధ కుల సంఘాల నాయకులతో అడిషనల్ ఎస్పీ లక్ష్మీ నారాయణ తో కలిసి అదనపు కలెక్టర్ పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..రంజాన్ పండుగను సోదరభావంతో,శాంతి భద్రతలకు భంగం కలగకుండా జరుపుకోవాలన్నారు. ప్రార్థనా స్థలాల వద్ద తాగునీరు, పారిశుధ్యం,విద్యుత్,ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలను సంబంధిత శాఖలు సమన్వయంతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.పోలీస్ శాఖ అధికారులు పండుగ రోజుల్లో ప్రత్యేక బందోబస్తు,ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రజల సహకారంతో రంజాన్ పండుగను విజయవంతంగా పూర్తి సమన్వయంతో పండుగ జరపాలన్నారు.ఈ సమావేశంలో మైనారిటీ సంక్షమే అధికారిని జయమ్మ,మున్సిపల్ చైర్మన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్,సంబంధిత శాఖల అధికారులు,పీస్ కమిటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాబోయే రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News