Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:10 PM

పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి పరీక్ష రాసిన విద్యార్థి

07-03-2026 254 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తల్లి అంత్యక్రియల ముందు భవిష్యత్తు కోసం పరీక్షకు హాజరు

నల్లగొండ జిల్లా, నార్కట్ పల్లి మండలానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థి జీవితంలో అత్యంత విషాద సమయంలో కూడా ధైర్యం కోల్పోకుండా పరీక్షకు హాజరై అందరినీ కదిలించాడు. కన్నతల్లి మరణించిన దుఃఖంలో ఉన్నప్పటికీ తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్ష రాసి అనంతరం తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.వివరాల్లోకి వెళ్తే.. నార్కట్పల్లి మండల కేంద్రానికి చెందిన జాల హేమలత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందింది. ఆమె కుమారుడు శివచరణ్ నల్లగొండలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వార్షిక పరీక్షలకు నల్లగొండ పట్టణంలో హాజరవుతున్నాడు.

ఇలాంటి సమయంలో తల్లి మరణ వార్తఅతడినితీవ్రంగాకలిచివేసింది. ఒకవైపు కన్నతల్లి అంత్యక్రియలు నిర్వహించాల్సిన బాధ్యత, మరోవైపు భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష… ఏది ముందు చేయాలో అర్థంకాని పరిస్థితిలో శివచరణ్ నిలిచిపోయాడు.

అయితే బంధువులు, స్థానికులు అతనికి ధైర్యం చెప్పి ముందుగా జీవితాన్ని నిలబెట్టే పరీక్ష రాయాలని సూచించారు. వారి సలహాతో పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకుని శివచరణ్ పరీక్షా కేంద్రానికి వెళ్లాడు.

కన్నీరు ఆపుకుంటూ, మనసులో తల్లి జ్ఞాపకాలు మెదులుతూనే పరీక్షను రాసి బయటకు వచ్చాడు. అనంతరం నార్కట్పల్లికి చేరుకుని తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.

ఈ సంఘటనను చూసిన బంధువులు, స్థానికులు శివచరణ్ ధైర్యసాహసాలను కొనియాడుతూ, ఇలాంటి కఠిన పరీక్ష ఎవరికి రాకూడదని భావోద్వేగానికి లోనయ్యారు.జీవితంలో ఎదురైన తీవ్రమైన విషాదాన్ని తట్టుకుని భవిష్యత్తు కోసం ముందడుగు వేసిన శివచరణ్ నిర్ణయం స్థానికంగా అందరినీ కదిలించింది.

Sthanikam

పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి పరీక్ష రాసిన విద్యార్థి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News