Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:45 AM

పునరుద్ధరణీయ ఇంధనాలే భవిష్యత్తు నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జాతీయ సదస్సు

13-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు (మార్చి 12–13) నిర్వహించిన “గ్రీన్ ఎనర్జీ రిసోర్సెస్: క్లీన్ ఎన్విరాన్‌మెంట్ ఇన్ ఇండియా” అంశంపై జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది.

ముగింపు కార్యక్రమం తొలి సెషన్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ పి. జలపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలంటే శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి పునరుద్ధరణీయ ఇంధన వనరులపై విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు దృష్టి సారించాలని ఆయన సూచించారు. సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో గ్రీన్ మెథడ్స్, నానో మెటీరియల్స్ పాత్రను వివరించారు.

మరో అతిథి ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డి.ఎ. పద్మావతి మాట్లాడుతూ వివిధ శక్తి వనరుల వినియోగం, వాటి పరిమితులను విశ్లేషించారు. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజ రహిత ఇంధన లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తోందని, 2070 నాటికి ‘నెట్ జీరో’ సాధించేందుకు విద్యార్థులు పరిశోధనలను దిశానిర్దేశం చేయాలని సూచించారు. కంప్యూటేషనల్ కెమిస్ట్రీ ద్వారా ఎనర్జీ మెటీరియల్స్ మోడలింగ్ ప్రాధాన్యతను వివరించారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ నవీన్ కుమార్ (ఫార్మా రంగం) మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమల్లో వ్యర్థాల నిర్వహణతో పాటు గ్రీన్ ఫార్మాస్యూటికల్స్ అవసరాన్ని వివరించారు. పర్యావరణహిత రసాయన శాస్త్రం వల్ల కలిగే దీర్ఘకాల ప్రయోజనాలను ఉదాహరణలతో తెలిపారు. అనంతరం అతిథులు పరిశోధనా పత్రాల సావనీర్‌ను ఆవిష్కరించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ సదస్సును విజయవంతంగా నిర్వహించిన రసాయన శాస్త్ర విభాగాన్ని, ముఖ్యంగా సదస్సు సంచాలకులు ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, వైస్ ప్రిన్సిపాల్ డా. పరంగి రవికుమార్‌ను అభినందించారు. అనంతరం సదస్సులో పాల్గొన్న వక్తలను, నిర్వాహకులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. బొలిశెట్టి వెంకటేశ్వర్లు, డా. అనిల్ కుమార్ బొజ్జ, డా. ఎం. అనిల్ కుమార్, పరీక్షల నియంత్రణాధికారి డా. ది. మునిస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ బి. నాగరాజు, అధ్యాపకులు డా. ఎ. మల్లేశం, తెలుగు విభాగాధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, కోటయ్య, జ్యోత్స్నతో పాటు ఇతర విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

పునరుద్ధరణీయ ఇంధనాలే భవిష్యత్తు నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జాతీయ సదస్సు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News