Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసానికి కరాటే ఉత్తమ మార్గం:ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 14, 2026 12:31 AM

ప్రతి ఒక్కరికి క్రీడా స్ఫూర్తి ఉండాలి

ప్రతి ఒక్కరికి క్రీడా స్ఫూర్తి ఉండాలి

ప్రతి ఒక్కరికి క్రీడా స్ఫూర్తి ఉండాలి
January 16, 2026 08:03 PM 246 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్

తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టపర్తి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏబీఎన్ సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ, క్రికెట్ పోటీలు శుక్రవారం నాడు ముగిశాయి. గ్రామంలో కబడ్డీ 15 టీములు, క్రికెట్ 13 టీములు పోటీపడ్డాయి. కబడ్డీ పోటీలో ఫైనల్ గా యాదవ సంఘం, బాపనబాయి తండా తలపడ్డాయి. ఈ కబడ్డీ పోటీలో ప్రధమ బహుమతిగా యాదవ సంఘం, ద్వితీయ బహుమతిగా బాపనబాయి తండా గెలుచుకున్నారు. క్రికెట్ పోటీలో చీకరుగూడెం, గల్లి టీమ్స్ తలపడ్డాయి. ఈ ఇరుజట్లు ఓరావూరిగా తలపడ్డాయి చివరిగా గల్లి టీమ్స్ ప్రధమ బహుమతి, ద్వితీయ బహుమతి చీకటి గూడెం గెలుచుకున్నారు. ఈ పోటీలో గెలుచుకున్న క్రీడాకారులకు సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న బహుమతులను అందజేశారు. ఈ పోటీలో బెస్ట్ రైడర్ గా, బెస్ట్ బౌలింగ్, వారికికూడా షీల్డ్ తో పాటు నగదు బహుమతి కూడా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఈ పోటీలు నిర్వహించిన ఏబీఎన్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ సంస్థ వారికి ఆకుల బక్కయ్య నాలి వీరసములు బాలగని అవిలయ్య బాలగాని మల్లికార్జున్ జ్ఞాపకార్థంగా వారి కుమారులు

ఆకుల రమేష్,

నాలి సంపత్,

బాలగాని కుమార స్వామి,

బలగాని నాగరాజు ముందుగా వారిని అభినందించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని క్రమశిక్షణ ఉంటుందని అన్నారు స్నేహ సంబంధాలు బలపడతాయని అన్నారు. ఈ పోటీలో గెలుపు ఓటమి సహజమని ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తిని ఎంచుకోవాలని అన్నారు. యువకులో దాగివున్న నైపుణ్యాన్ని వెలుగు తీయడానికి క్రీడ పోటీల నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అనే బోయిన శ్రీకాంత్ , సింగిల్ విండో డైరెక్టర్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి,మాజీ సర్పంచులు గుమ్మడవెల్లి సోమయ్య, చంద వెంకన్న, మాజీ ఎంపిటిసిలు కేతిరెడ్డి లతా విజయకుమార్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బర్ల సోమన్న, ఉపాధ్యక్షులు బాలగని ప్రవీణ్ కుమార్, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News