Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:06 PM

పోలీస్ స్టేషన్ ఆవరణలో కనువిందు చేసిన రంగురంగుల ముగ్గులు

16-01-2026 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సంక్రాంతి ముగ్గుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణను సంప్రదాయానికి అద్దం పట్టే విధంగా, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే రంగురంగుల ముగ్గులతో అందంగా అలంకరించారు. ఈ ముగ్గులు చూసిన వారిని ఆకట్టుకునేలా ఉండటంతో పాటు, సమాజానికి అవసరమైన ముఖ్యమైన సందేశాలను ప్రజలకు చేరవేశాయి.ఈ సందర్భంగా ప్రజల్లో భద్రతపై అవగాహన కల్పించేందుకు, రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, అలాగే చైనా మాంజా వలన చిన్నారులు సహా పలువురు ప్రాణాలను కోల్పోతున్న ఘటనల నేపథ్యంలో, ఆ మాంజా వినియోగం ఎంతటి ప్రమాదకరమో తెలియజేసే చిత్రాలతో ముగ్గులను రూపొందించారు. ఈ అన్ని అంశాలను సమర్థవంతంగా ప్రతిబింబించేలా జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ వనజ ఈ ముగ్గులను ఎంతో శ్రద్ధతో, కళాత్మకంగా అలంకరించి అందరి మన్ననలు పొందారు.ఈ కార్యక్రమం ద్వారా సంక్రాంతి వంటి సంప్రదాయ పండుగల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడంతో పాటు, నేటి సమాజంలో తగ్గిపోతున్న సాంస్కృతిక విలువలను కాపాడుతూ, ప్రజలలో బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. పండుగలు కేవలం ఆనందానికి మాత్రమే కాకుండా, సమాజానికి మేలు చేసే సందేశాలను అందించే సందర్భాలుగా కూడా మారాలని వారు అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి శాంతియుతంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సూచించారు. అలాగే పండుగ వేళ రహదారులపై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకుండా తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలని కోరారు. ముఖ్యంగా చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, ప్రాణాలకు ముప్పు కలిగించే చైనా మాంజా వినియోగానికి పూర్తిగా దూరంగా ఉండాలని, సురక్షితమైన సంప్రదాయ ఆటలకే ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులు హితవు పలికారు.ఈ ముగ్గుల కార్యక్రమం పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువయ్యేలా చేయడంతో పాటు, భద్రతా అంశాలపై అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

పోలీస్ స్టేషన్ ఆవరణలో కనువిందు చేసిన రంగురంగుల ముగ్గులు

Article Image

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News