Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తడ్కల్‌లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. భారీ ర్యాలీలో పాల్గొన్న యువత, ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 07:32 PM

పండరీపూర్ మహా పాదయాత్ర సందర్భంగా ముంగి మహారాజును దర్శించుకున్న మచ్చేందర్

17-01-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండలం చీమలపాడు గ్రామంలో పండరీపూర్ మహా పాదయాత్ర సందర్భంగా విచ్చేసిన పూజ్యులు ముంగి మహారాజును గుఱ్ఱపు మచ్చేందర్ భక్తిశ్రద్ధలతో దర్శించుకొని వారి ఆశీర్వాదాలను స్వీకరించారు.ఈ సందర్భంగా గుఱ్ఱపు మచ్చేందర్ మాట్లాడుతూ, పండరీపూర్ మహా పాదయాత్ర సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తూ మానవీయ విలువలను మరింత బలపరుస్తోందని తెలిపారు. భక్తి, సేవ, సత్సంకల్పంతో కొనసాగుతున్న ఈ మహా పాదయాత్ర ప్రజల మధ్య ఐక్యతను పెంచుతూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించే గొప్ప కార్యక్రమంగా నిలుస్తోందని అన్నారు. ముంగి మహారాజు ఆశీర్వాదాలతో ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కృష్ణాపూర్ మాజీ మండల పరిషత్ సభ్యుడు అంజయ్య సాగర్, దామర్గిద్ద మాజీ గ్రామ సర్పంచ్ శంకర్ సాగర్, సీనియర్ నాయకులు బసవరాజు పటేల్, వేర్శెట్టి పటేల్, రమేష్, గుండా రెడ్డి సంతోష్, దత్తు, సిద్ధు రెడ్డి, నర్సింహా రెడ్డి, ఫసిమియా, వీరేందర్, రాజు, ఇసరప్ప, సజీవ రెడ్డి, జ్ఞానపటేల్, గోవింద్ రావు, వెంకట్ రావు పటేల్, నరేష్, బొంబాయి మహారాజు, ఉప్పరి శ్రీకాంత్, చందప్ప, రాములు, భీమన్న, పవన్ పటేల్, రాజు, కూర్మ నాగయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చీమలపాడు గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. మహారాజు దర్శనార్థం భక్తులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. పండరీపూర్ మహా పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని, సమాజానికి శాంతి, సౌభాగ్యాలు కలగాలని అందరూ ఆకాంక్షించారు.

Sthanikam

పండరీపూర్ మహా పాదయాత్ర సందర్భంగా ముంగి మహారాజును దర్శించుకున్న మచ్చేందర్

Article Image

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News