Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భద్రతపై గ్రామస్తుల జాగ్రత్తలు.. సీసీ కెమెరాల ఏర్పాటు సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 02:02 PM

ఫిబ్రవరి12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.

ఫిబ్రవరి12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.

 ఫిబ్రవరి12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.
January 20, 2026 12:55 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

-కార్మిక,కర్షక బహిరంగ సభలో యస్ వీరయ్య CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు పిలుపు

స్థానికం:భువనగిరి రిపోర్టర్ కుమార్

కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్ లను రద్దుచేయాలని,వి.బి.జి రామ్ జి చట్టాన్ని, విద్యుత్తు సవరణ చట్టాన్ని విరమించుకోవాలని ఫిబ్రవరి12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(CITU)జాతీయ నాయకులు,రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్ వీరయ్య కార్మికులకు పిలుపునిచ్చారు.

సోమవారం రోజున కార్మిక,కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా CITU,రైతు,వ్యకాస వర్గ సంఘాల అధ్వర్యంలో భువనగిరి ప్రిన్స్ చౌరస్తా వద్ద CITU జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ..మోడీ పుట్టక ముందు నుండే దేశ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను నేడు మోడీ రద్దుచేసి కార్మికుల ఎనిమిది గంటలను పన్నెండు గంటలకు పెంచుతూ కార్పొరేట్ లకు ఉపయోగపడే అనేక విధానాలను పొందపర్చి కార్మికుల హక్కులను కాల రాస్తూ నాలుగు లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన నుండి నేటికి 16 లక్షల కోట్లు మాఫీ చేశారని కార్పొరేట్ ల భజన పరుడు మోడీ అనీ విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధికి గతంలో కేంద్ర ప్రభుత్వం 90శాతం నిధులు కేటాయించేదని నేడు దాన్ని 60శాతం నికి కుదించి రాష్ట్రాల పైన 40శాతం భారం వేసి ఉపాధి పథకం ఎత్తివేసి కుట్ర చేస్తుందని విమర్శించారు.గతంలో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకానికి పేరు మార్చి బిబిజి రాంజీ అనే పేరు మార్చి పథకాన్ని ఎత్తివేసి పుట్ట చేస్తున్నారని ఇది దేశ ప్రజానీకానికి తీవ్ర నష్టమని తెలియజేశారు.విద్యుత్ సవరణ బిల్లు చేశారని దీని వల్ల నేడు 200 యూనిట్లు లోపు కరెంట్ సబ్సిడీ పొందుతున్న రైతులకు,పేదలకు నష్టం జరుగుతుందని కార్పొరేట్ యాజమాన్యాలకు రేటు తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక,వ్యవసాయ కార్మికుల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాపితంగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు,కూలీలు,ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరు బాలరాజు గౌడ్ పాల్గొని ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో CITU జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు,కోశాధికారి ఎండీ.పాషా,జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ,నకిరేకంటి రాము,జిల్లా సహాయ కార్యదర్శులు తుర్కపల్లి సురేందర్,గొరిగే సోములు,పైళ్ల గణపతి రెడ్డి,పొట్ట యాదమ్మ,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు రాచకొండ రాములమ్మ,జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య,జిల్లా సహాయ కార్యదర్శులు సిరిపంగి స్వామి,గుంటో శ్రీనివాస్ చారి,తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బూరుగు కృష్ణా రెడ్డి,జిల్లా సహాయ కార్యదర్శి కందాడి సత్తి రెడ్డి,దోడ యాదిరెడ్డి,తుమ్మల

నర్సి రెడ్డి,ర్యాకల శ్రీశైలం,పొట్ట శ్రీను,ఆకుల ధర్మయ్య,దేశెట్టి సత్య నారాయణలు పాల్గొనగా NPRD జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్,DYFI జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్,SFI జిల్లా కార్యదర్శి లావుడ్య రాజు,PNM జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు,జిల్లా నాయకులు బిక్షపతి, శ్రీమాన్,ప్రవీణ్ మద్దతు తెలియజేసి పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News