Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 02:26 PM

ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి: ఎస్ఎఫ్ఐ

23-07-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించిన ఎస్ఎఫ్ఐ నాయకులు

రాష్ట్రంలో గత ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ₹10,500 కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ పట్టణంలోని మునుగోడు శాసనసభ్యుల కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు ముట్టడించారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ గేటుకు వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ​ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, లావుడియా రాజు మాట్లాడుతూ... స్కాలర్‌షిప్‌లు రాక పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని, కోర్సులు పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్ బకాయిలు విడుదల చేస్తామని ఇచ్చిన హామీ నీటిమూటగా మారిందని విమర్శించారు. జీవో నంబర్లు 7, 8ల ద్వారా వైఎస్సార్ హయాంలో తెచ్చిన స్కాలర్‌షిప్ పథకానికి గండి కొట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ​తక్షణమే పెండింగ్ స్కాలర్‌షిప్ నిధులను విడుదల చేయాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఇందురాణి, జిల్లా ఉపాధ్యక్షుడు ఇర్ల రాహుల్, సహాయ కార్యదర్శులు తిగుళ్ల శ్రీనివాస్, పుట్టల ఉదయ్, సృజన, జిల్లా కమిటీ సభ్యులు ప్రకాష్, ప్రసన్న, అరవింద్, నాయకులు సాయి, మల్లేశ్, మధు, చరణ్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి: ఎస్ఎఫ్ఐ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News