Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:37 AM

పెనుకొండలో సత్యసాయి డిగ్రీ కళాశాలపై ఆరోపణలు – ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి:ఏఐఎస్ఏ

06-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: పట్టణంలోని శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో జరుగుతున్న అక్రమాలు, విద్యార్థులపై జరుగుతున్న వేధింపులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం సీడీసీ డీన్ ప్రొఫెసర్ రంగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ, కళాశాల ప్రధానాచార్యుడు ఆదిశేషరెడ్డి అధికార పార్టీ అండదండలతో ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాలను పట్టించుకోకుండా కళాశాలను స్వంత ఆస్తిలా నడుపుతున్నారని ఆరోపించారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో సత్యసాయి ఇంటర్మీడియట్ కళాశాలలో పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులను అడ్డుకోవడం, వారి వివరాలను బలవంతంగా సేకరించడం, ఫోన్ నంబర్లు తీసుకోవడం వల్ల విద్యార్థుల పరీక్ష సమయం వృథా అయిందని పేర్కొన్నారు. ఇది విద్యా వ్యవస్థను అవమానపరిచే చర్య అని ఏఐఎస్ఏ నాయకులు విమర్శించారు.

అదేవిధంగా డిగ్రీ విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం, చదువు పూర్తిచేసిన విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇవ్వకుండా కళాశాలలోనే నిలిపివేయడం వంటి చర్యలతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. కళాశాలకు రాని విద్యార్థులకు కూడా హాజరు నమోదు చేసి, వివిధ ఫీజుల పేర్లతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

పరీక్షలు రాయడానికి వచ్చే ఇతర కళాశాలల విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించకపోవడం, గేటు బయట రోడ్లపై నిలబెట్టి కళాశాల ప్రాంగణంలోకి అనుమతి ఇవ్వకపోవడం విద్యార్థుల హక్కులను ఉల్లంఘించే చర్య అని పేర్కొన్నారు.

కాబట్టి వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపి శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలను పరీక్షా కేంద్రంగా రద్దు చేయాలని, కళాశాల గుర్తింపును తొలగించాలని, ప్రధానాచార్యుడు ఆదిశేషరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఏ డిమాండ్ చేసింది. విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థులను దోచుకునే యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే విద్యార్థి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బాలకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు భీమేష్, జిల్లా నాయకుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెనుకొండలో సత్యసాయి డిగ్రీ కళాశాలపై ఆరోపణలు – ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి:ఏఐఎస్ఏ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News