Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:20 PM

పెనుకొండలో మహిళా దినోత్సవ వేడుకలు 9కి వాయిదా

07-03-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెనుకొండ పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఈ నెల 8వ తేదీన నిర్వహించాల్సిన మహిళా దినోత్సవ వేడుకలు అనివార్య కారణాల వల్ల మార్చి 9వ తేదీ సోమవారం సాయంత్రం 3 గంటలకు నిర్వహించనున్నట్లు ఎన్డీయే కూటమి నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్, చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

కార్యక్రమంలో భాగంగా మార్చి 9న సాయంత్రం 3 గంటలకు అంబేద్కర్ సర్కిల్ వద్ద గల ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలో అందరూ చేరుకోవాలని తెలిపారు. అక్కడ మంత్రి సవితమ్మ బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్ షెల్టర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా జూనియర్ కళాశాల మైదానం వరకు ర్యాలీ నిర్వహిస్తారు.

జూనియర్ కళాశాల మైదానంలో మంత్రి సవితమ్మ సౌజన్యంతో నూతనంగా నిర్మించిన స్టేజ్‌ను ప్రారంభించి అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభ నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి మహిళలు, టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆర్పీలు, యానిమేటర్లు, మహిళా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎన్డీయే కూటమి నాయకులు కోరారు.

ఈ సమావేశంలో పెనుకొండ టీడీపీ అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, చంద్రకాంతమ్మ, డ్వాక్రా రామాంజనేయులు, ప్రభంజన్ స్వామి, సాయిప్రసాద్, ఆర్పీలు, యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

పెనుకొండలో మహిళా దినోత్సవ వేడుకలు 9కి వాయిదా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News