Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:35 PM

పెనుకొండలో “జలం–జీవం” నినాదంతో చెరువు శుభ్రత కార్యక్రమం

18-04-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో “జలం–జీవం” అనే ప్రధాన నినాదంతో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా భోగసముద్రం చెరువులో విస్తృత స్థాయిలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత స్వయంగా పాల్గొని చెరువులోని చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీటి వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, “జలం ఉంటేనే జీవం ఉంటుంది” అనే భావనను ప్రజల్లో నాటేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

చెరువులు, కాలువలు శుభ్రంగా ఉంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఆమె పేర్కొన్నారు. అనంతరం అధికారులు, స్థానిక ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని శుభ్రతకు తమ మద్దతు తెలిపారు.

Sthanikam

పెనుకొండలో “జలం–జీవం” నినాదంతో చెరువు శుభ్రత కార్యక్రమం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో “జలం–జీవం” అనే ప్రధాన నినాదంతో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా భోగసముద్రం చెరువులో విస్తృత స్థాయిలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత స్వయంగా పాల్గొని చెరువులోని చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీటి వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, “జలం ఉంటేనే జీవం ఉంటుంది” అనే భావనను ప్రజల్లో నాటేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

చెరువులు, కాలువలు శుభ్రంగా ఉంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఆమె పేర్కొన్నారు. అనంతరం అధికారులు, స్థానిక ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని శుభ్రతకు తమ మద్దతు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News