Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:38 PM

పెనుకొండలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ 1000 రోజులు పూర్తి – ఘనంగా వేడుకలు

18-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ : పెనుకొండలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సవిత హాజరై క్యాంటీన్ వద్ద కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన ప్రజలకు స్వయంగా భోజనం వడ్డించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి Y. S. జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. అన్నా క్యాంటీన్లను నిలిపివేసి పేదలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం N. తారక రామ రావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు.

గతంలో N. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెద్ద ఎత్తున అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదలకు తక్కువ ధరకే భోజనం అందించారని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా రూ.5కే భోజనం అందించేలా క్యాంటీన్లు నిర్వహించామని చెప్పారు. నేటితో 1000 రోజులు పూర్తి కావడం ఆనందకరమని పేర్కొన్నారు.

అన్నా క్యాంటీన్ ప్రారంభ సమయంలో వైసీపీ నాయకులు అడ్డంకులు సృష్టించారని, అయితే తిరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించి పేదల ఆకలి తీర్చుతున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వందలాది అన్నా క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు రూ.5కే భోజనం అందిస్తున్నామని వివరించారు.

ఇంకా, ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా పెనుకొండలో అధికారికంగా మరో అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. అలాగే త్వరలో గోరంట్ల మండలంలో కూడా సొంత నిధులతో క్యాంటీన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

పెనుకొండలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ 1000 రోజులు పూర్తి – ఘనంగా వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News