Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:25 PM

పెనుకొండలో బహుజన చైతన్య వేదిక ర్యాలీ, తపాలా కార్యాలయం ముట్టడి

07-03-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: ఆర్‌డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) లైసెన్స్‌ను తక్షణం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో పెనుకొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే తపాలా శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు.

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శివరామకృష్ణ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. తహశీల్దార్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ సర్కిల్, దర్గా సర్కిల్, ఎస్‌కేడీ సర్కిల్, తెలుగుతల్లి సర్కిల్, ఎన్‌టీఆర్ సర్కిల్ మీదుగా పట్టణంలోని తపాలా శాఖ కార్యాలయం వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ ఆర్‌డీటీ సంస్థకు FCRA రెన్యువల్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలను ముట్టడి చేస్తూ తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆర్‌డీటీ సంస్థ అందిస్తున్న సేవలు ఎంతో ఉపయోగకరమని, ఆ సేవలకు ఆటంకం కలిగించడం బాధాకరమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసంఘం వ్యవస్థాపకులు దాసాగానిపల్లె కుళ్ళయ్యప్ప, జై భీమ్ భారత్ పార్టీ నాయకులు, రాయలసీమ కోఆర్డినేటర్ చల్లాపల్లి ఈశ్వర్, రంగేపల్లి కదిరప్ప, నరసింహులు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

పెనుకొండలో బహుజన చైతన్య వేదిక ర్యాలీ, తపాలా కార్యాలయం ముట్టడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News