Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:40 AM

పెనుకొండలో అవగాహన ర్యాలీ: బాలికల భద్రత, రోడ్డు నియమాలపై చైతన్యం

21-04-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

పెనుకొండ: బాలికలపై జరిగే నేరాలను అరికట్టేందుకు పోక్సో చట్టంపై అవగాహన ప్రతి ఆడపిల్లకు తప్పనిసరిగా ఉండాలని అధికారులు సూచించారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. అనుచితంగా ప్రవర్తించే వ్యక్తులు బంధువులు, పక్కింటివారు, లేదా కుటుంబ సభ్యులే అయినా వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలని బాలికలకు సూచించారు.

మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వారి భద్రత కోసం పోలీసులు 24 గంటలు పని చేస్తున్నారని తెలిపారు.

అలాగే రోడ్డు భద్రతపై మాట్లాడుతూ, పెట్రోల్ బంక్‌ల వద్ద హెల్మెట్ ధరించినవారికే ఇంధనం అందించాలని నిర్వాహకులు కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. యువత మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సత్యసాయి జిల్లాలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో “అతివేగం కన్నా ప్రాణం మిన్న” అని అవగాహన కల్పించారు.

ఈ మేరకు పెనుకొండలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఎస్పీ సతీష్, ఆర్‌టీఓ కరుణసాగర్ రెడ్డి, డీఎస్పీ నరసింగప్ప, ఎంవీఐ స్వాతి, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెనుకొండలో అవగాహన ర్యాలీ: బాలికల భద్రత, రోడ్డు నియమాలపై చైతన్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News