Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:13 PM

పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
April 03, 2026 07:20 PM 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల పనుల పురోగతిపై అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎ. భాస్కర్ రావు, IAS శుక్రవారం మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ UIDF, TUFIDC, అమృత్ పథకం, స్వచ్ఛ భారత్ తదితర అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధిత కాంట్రాక్టర్లతో సమావేశాలు నిర్వహించి, పనులను నిర్ణీత గడువులో నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు.

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ మున్సిపాలిటీలోనూ నీటి ఎద్దడి లేకుండా ప్రజలకు సమృద్ధిగా తాగునీరు అందేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, చెత్త కుప్పలు లేకుండా ప్రతిరోజూ శుభ్రత పనులు నిర్వహించాలని ఆదేశించారు.

ఆస్తిపన్ను వసూళ్లలో 5 శాతం రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించి, పన్నుల వసూళ్లను నూటికి నూరు శాతం సాధించేందుకు కృషి చేయాలని కమిషనర్లను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ డీఈఈ , ఏఈ లు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News