Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:32 PM

పేదలకు భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎమ్మెల్యే వేముల వీరేశం

22-01-2026 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

నకిరేకల్ నియోజకవర్గంలోని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పెద్ద భరోసాగా నిలుస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం నాడు నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా ఆలయ మందిరంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన 212 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.90 లక్షల 87 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఇప్పటివరకు నకిరేకల్ నియోజకవర్గంలో రూ.18 కోట్ల 24 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. వైద్య చికిత్సల కోసం పేదలకు ఈ నిధి ఎంతో ఉపయోగపడుతోందన్నారు.

త్వరలో నకిరేకల్‌లో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే ట్రామా కేర్ సెంటర్, సిటీ స్కాన్ వంటి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సమస్యలపై దృష్టి పెట్టి పనిచేస్తోందని అన్నారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు.

నియోజకవర్గంలో ఇప్పటివరకు 3,500 ఇళ్లను కేటాయించామని, మార్చి నెలలో మరో 3,500 ఇళ్లను పంపిణీ చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందుకున్న ప్రతి లబ్ధిదారుడికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చెవుగోని రజిత–శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్లు గుత్తా మంజుల–మాధవ్ రెడ్డి, నర్రా వినోద–మోహన్ రెడ్డి, మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

పేదలకు భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News